News March 8, 2025
జనగామ: విషాదం.. ఆశా కార్యకర్త మృతి

జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండలోని ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త చీటకోడూర్ మహేశ్వరి హార్ట్ స్ట్రోక్‌తో శుక్రవారం మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తిపరంగా గ్రామంలోని ప్రజలందరి మన్ననలు పొందిన ఆమె మృతిపై గ్రామస్థులు బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు.
Similar News
News March 15, 2025
భద్రాద్రి: లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఓ మంచి రోజు అని మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్, సీఆర్పీఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ పాల్గొన్నారు.
News March 15, 2025
నరసరావుపేట: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ

స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరి సహకారంతోనే స్వచ్ఛ పల్నాడు సాధ్యమవుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, డి.ఆర్.వో. మురళి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
News March 15, 2025
సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.