News April 11, 2025
జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Similar News
News November 15, 2025
IPL: మ్యాక్సీని వదిలేసిన పంజాబ్!

ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోకుండా పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టింది. ఆయనతో పాటు ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, విష్ణు వినోద్‌ను కూడా విడుదల చేసింది. IPLలో విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన మ్యాక్సీ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నారు. ఈ ఏడాది టోర్నీలో 7 మ్యాచులాడి కేవలం 47 పరుగులే చేశారు. దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 15, 2025
పాకాల: ధాన్యం కొనుగోళ్లలో కఠిన నిబంధనలు..!

వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుండానే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. జల్లెడ వేసిన ధాన్యానికే టోకెన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో రైతులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తాలు, మట్టి, పాడైన ధాన్యం 5% లోపే ఉండాలన్న నిబంధనలు, మిల్లర్ల కేటాయింపు ఆలస్యం రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు పాటించకపోతే కొనుగోలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
News November 15, 2025
ఉత్తమ్ ప్రచారం.. భారీ మెజార్టీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించిన యూసఫ్‌గూడ డివిజన్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి 13,829 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ పార్టీకి 8,537 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 5,292 ఓట్ల (దాదాపు 21%) భారీ మెజారిటీని నమోదు చేసింది. దీంతో, మంత్రి ఉత్తమ్ వ్యూహరచన సత్ఫలితాన్ని ఇచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


