News April 12, 2025

జనగామ వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

image

జనగామ వ్యవసాయ మార్కెట్ రెండు రోజులు సెలవు ఉన్నందున రైతులు గమనించి ధాన్యాన్ని తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 13 ఆదివారం, 14 సోమవారం బాబా సాహెబ్ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సెలవు ఉన్నందున రైతులు గమనించాలన్నారు. మార్కెట్ తిరిగి 15న మంగళవారం ప్రారంభమవుతుందన్నారు.

Similar News

News December 8, 2025

సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై శిక్షణ: డీఈవో

image

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలపై అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నోడల్‌ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి విడత శిక్షణకు హాజరుకాని అధికారులు తప్పనిసరిగా ఈ శిక్షణకు హాజరు కావాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 8, 2025

ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

image

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.

News December 8, 2025

సిద్దిపేట జిల్లాలో 10 నుంచి జాగ్రత్త

image

సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ 10 నుంచి 13 వరకు రాబోయే 7 రోజుల్లో శక్తివంతమైన శీతల గాలలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పింక్ మార్కు ఉన్న జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 6-9°C వరకు తగ్గనున్నాయి. అదేవిధంగా నీలం మార్క్ ఉన్న జిల్లాల్లో 9-12°C వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.