News April 12, 2025
జనగామ వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు

జనగామ వ్యవసాయ మార్కెట్ రెండు రోజులు సెలవు ఉన్నందున రైతులు గమనించి ధాన్యాన్ని తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 13 ఆదివారం, 14 సోమవారం బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవు ఉన్నందున రైతులు గమనించాలన్నారు. మార్కెట్ తిరిగి 15న మంగళవారం ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News April 16, 2026
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘దోస్త్’ సందడి

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థలైన నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉండటంతో ఈ కళాశాలలకు డిమాండ్ పెరిగింది. మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు గడువు ఉంది.
#SHAREIT
News April 16, 2026
HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.
News April 16, 2026
WGL: తెర మీదకు పాత నియోజకవర్గ పేర్లు!

అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 18 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.దీంతో పెరిగే నియోజకవర్గాలు ఏంటనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, గతంలో కనుమరుగైన నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. శాయంపేట, ధర్మసాగర్, గుడూరు, చేర్యాల, హసన్‌పర్తితో పాటుగా కొత్తగా నెక్కొండ, కాజీపేట నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటున్నారు.


