News March 28, 2025
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు

ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1వరకు నాలుగు రోజులపాటు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రకటన ఒక ద్వారా తెలిపారు. రైతులు ఈ 4 రోజులు మార్కెట్కు తమ ఉత్పత్తులను తీసుకురావద్దని, తిరిగి 2న మార్కెట్ పునః ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News December 15, 2025
BRS, కాంగ్రెస్ మద్దతు.. CPMకు కంఠాయపాలెం ఉప సర్పంచ్?

MHBD జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైనట్లు సమాచారం. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ 5, సీపీఐ(ఎం) 2, బీఆర్ఎస్ మద్దతుదారులు 2, అధికార కాంగ్రెస్ 1 వార్డు గెలిచారు. అయితే, కాంగ్రెస్కు చెందిన ఒక్క వార్డు సభ్యుడు బీఆర్ఎస్, సీపీఎంకు మద్దతు ఇవ్వడంతో వీరి బలగం 5కు చేరి ఉపసర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
News December 15, 2025
ఇంధన ధరల్లో తేడాకు అవే కారణం: కేంద్రం

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74, అండమాన్&నికోబార్లో రూ.82.46గా ఉంది. రవాణా ఖర్చులు, ఆయా రాష్ట్ర/UT ప్రభుత్వాలు విధించే VAT (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)లో తేడాలే ఇందుకు కారణం’ అని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై VAT రూ.21.90, అండమాన్లో రూ.0.82గా ఉంది.
News December 15, 2025
మూడో విడతకు నల్గొండ యంత్రాంగం సిద్ధం

గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్కు దేవరకొండ డివిజన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 17న చందంపేట, దేవరకొండ సహా 9మండలాల్లోని 2,206 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన సిబ్బంది 2,647 ప్రిసైడింగ్, 2,959 అసిస్టెంట్ ప్రిసైడింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో సోమవారం ఈ ప్రక్రియ జరిగింది..


