News April 2, 2025
జనగామ: సన్నం బియ్యం పంపిణీకి విస్తృత చర్యలు: కలెక్టర్

జనగామ జిల్లాలో సన్నబియ్యం పంపిణీకి విస్తృత చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రారంభించడంతో జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో MLA యశస్విని రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 1,61,264 రేషన్ కార్డులకు గాను నిత్యవసర దుకాణాల ద్వారా 3151.228 మెట్టు టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 4, 2025
స్విమ్స్కు జాతీయ ప్రాముఖ్యత హోదా ఇవ్వండి: ఎంపీ

రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్కు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేసే అవకాశం వస్తుందన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాల అభివృద్ధి, నూతన పరిశోధన ప్రయోగశాలలు, వైద్య పరికరాలకు నిధులు వస్తాయన్నారు.
News April 4, 2025
వైసీపీ నేతలను జైలుకు పంపడమే వారి లక్ష్యం: మేరిగ

రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ నాయకులు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్యాయంగా, అక్రమంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. ఎంతో సౌమ్యుడిగా, మంచి పేరున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం దారుణమన్నారు.
News April 4, 2025
వనపర్తి: ‘ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి’

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండ్ల రాజు,పుట్ట ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వనపర్తిలోని సీఐటీయూ కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునీత అధ్యక్షతన ఆశా వర్కర్ల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.