News March 13, 2025
జనగామ: సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News March 19, 2025
ప.గో : వారికి పింఛను కట్

ప.గో జిల్లాలో ఫించనుదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 20 లోగా జీవన ప్రమాణాల పత్రం సంబంధిత అధికారులకు అందించాలని, లేకుంటే మార్చి నెలకు సంబంధించిన పింఛను సొమ్మును నిలిపివేస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 14, 739 మంది ఉండగా.. గత నెల చివరి వరకు 14, 335 మంది పత్రాలను అందించినట్లు తెలిపారు. మిగిలిన వారికి పింఛను ఆపేసే అవకాశముందన్నారు.
News March 19, 2025
VZM: చిన్న శ్రీను కుమారుడి మృతి

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.
News March 19, 2025
నేను పార్టీ మారలే.. BRSలోనే ఉన్నా: మహిపాల్ రెడ్డి

‘నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. BRSలోనే కొనసాగుతున్నా’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. MLAల అనర్హత పిటిషిన్‌పై ఈనెల 25న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేఫథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం జారీ చేసిన నోటీసులకు గానూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.