News February 5, 2025

జనగామ: స్త్రీనిధి రుణాల రికవరీ శాతాన్ని పెంచాలి: కలెక్టర్

image

కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీఓఏలు, డీపీఎంలతో రుణాల రికవరీ, జిల్లాకు కేటాయించిన సమాచార సంక్షిప్త పరికరాలపై(E-pass machines) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 10న రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు రానున్న నేపథ్యంలో స్త్రీనిధి రుణాల రికవరీ పట్ల శ్రద్ధ వహించాలని, రికవరీ శాతాన్ని పెంచాలని సూచించారు.

Similar News

News February 15, 2026

మహాశివరాత్రి నేపథ్యంలో దారులన్నీ వేములవాడకే..!

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి జాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండడంతో వేములవాడలో సందడిగా మారింది. ముఖ్యంగా మహాశివరాత్రి జాగారం కోసం భక్తులు తరలిరావడం ఆనవాయితిగా వస్తుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.

News February 15, 2026

NZB: అక్కడ పోలీసులకు ఏం పని? : MP అర్వింద్

image

BRS కార్పొరేటర్ ఇంటి దగ్గర మీ ACP, నలుగురు SI లు ఏం చేస్తున్నారు?, అక్కడ వారికి ఏం పని’ అని MP అర్వింద్ ధర్మపురి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లేందుకు సాయం చేస్తున్నారా గడ్డి మేపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కాంగ్రెస్‌కు సేవ చేసేందుకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 15, 2026

ASF: MLAగా తండ్రి.. ఛైర్‌పర్సన్‌గా తల్లి, కౌన్సిలర్‌గా కొడుకు

image

కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు 17 ఓల్డ్ కాలనీ నుంచి కావేటి విజయ్ కౌన్సిలర్‌గా విజయం సాధించాడు. ఆయన తండ్రి కావేటి సమ్మయ్య MLAగా, ఆయన తల్లి సాయిలీల SKZR మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మద్దతుతో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తల్లిదండ్రుల మార్గంలో నడుస్తూ అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ప్రకటించారు.