News February 12, 2025

జనగామ: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

image

జనగామ జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.

Similar News

News March 19, 2025

నెల్లూరు: ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిచి హత్య

image

నెల్లూరు పొద‌ల‌కూరు రోడ్డులో చింటూ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయ‌పాళెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కృష్ణ సాయి అనే నిందితుడికి మృతుడికి మ‌ధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 14న చింటూకి ఫోన్ చేసి తన ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిపించి కత్తులతో పొడిచి హ‌త్య చేశారు.

News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఏలూరు హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

News March 19, 2025

శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీ ఐ)లో ఈనెల 20 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఇతర అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!