News March 10, 2025
జనగామ: స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు మంజూరు

పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలోని 450 పాఠశాలకు రూ.48,25,000 నిధులను విడుదల చేసింది. ఈమేరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ఖాతాల్లోకి నిధులు జమ చేసింది. వచ్చిన నిధులతో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం ఆట వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
వెంకటాపురం భార్యాభర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్

వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ముగియడంతో గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్‌గా శకుంతలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఆమె భర్త వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమై, ఆపై ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషం. ఇకపై ఈ భార్యాభర్తలు పదవుల్లో కొనసాగనున్నారు.
News December 7, 2025
విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.