News March 14, 2025
జనగామ: 17 పాఠశాలల్లో కృత్రిమ మేథ బోధన: కలెక్టర్

కృత్రిమ మేథ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసనా సామర్థ్యాలను సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన జిల్లాలోని 17 ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కృత్రిమ మేథ బోధన వెనుకంజలో ఉన్న విద్యార్థులకనుగుణంగా ప్రశ్నలను రూపొందించి, వారిలో అభ్యసనా సామర్థ్యాల పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు.
Similar News
News September 19, 2025
20న జనగామలో ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు జరుగుతాయి. ప్రతి కళాశాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని క్రీడల కన్వీనర్ అజ్మీర కిషన్ తెలిపారు.
News September 19, 2025
పాకిస్థాన్ ఓవరాక్షన్‌పై ICC సీరియస్!

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News September 19, 2025
సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్‌ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.