News March 6, 2025

జనగామ: 203 మంది పరీక్ష రాయలే

image

జనగామ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 203 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. జనరల్, వొకేషనల్ మొత్తం 4481కి 4278 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. డీఐఈఓ, స్క్వాడ్ బృందం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News December 21, 2025

నంద్యాల: ‘ఇలా చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది’

image

నేషనల్ కన్జ్యూమర్స్ డే వారోత్సవాల్లో భాగంగా నంద్యాలలోని పలు హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పించారు. హోటల్స్‌లో ఎక్కువగా కలర్స్ వాడుతున్నారని, వాటిని వాడితే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడతారని తెలిపారు. నాణ్యమైన, ప్రామాణికత గల వస్తువులనే వినియోగించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు రవిబాబు, వెంకటరమణ, ఖదిమ్ వలి, అమిర్ బాషా పాల్గొన్నారు.

News December 21, 2025

మరిగించిన టీ.. 20 నిమిషాల తర్వాత తాగుతున్నారా?

image

టీ కాచిన 20 నిమిషాల తర్వాత తాగడం మంచిది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్‌లో ఆక్సిడేషన్ జరిగి బ్యాక్టీరియా ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. రెండోసారి కాచిన టీ తాగితే జీర్ణాశయ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు. 24 గంటల తర్వాత టీని జపాన్‌లో పాము కాటు కంటే ప్రమాదకరమైనదిగా, చైనాలో విషంతో పోలుస్తారు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే బ్యాక్టీరియా పెరుగుదల నెమ్మదిస్తుంది.

News December 21, 2025

HYD: KCR మాటల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్

image

అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు ఫామ్ హౌస్‌కే పరిమితమైన BRS అధినేత KCR నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. BRSLP సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక అధికార పార్టీ నాయకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయన గళం కోసం వెయిటింగ్.