News March 6, 2025

జనగామ: 203 మంది పరీక్ష రాయలే

image

జనగామ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 203 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. జనరల్, వొకేషనల్ మొత్తం 4481కి 4278 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. డీఐఈఓ, స్క్వాడ్ బృందం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News July 6, 2025

పార్వతీపురం: జిల్లాకు వచ్చిన నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్

image

అశావాహ జిల్లాగా గుర్తించిన పార్వతీపురం మన్యం జిల్లాకు నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్‌ మహేంద్ర కుమార్ శనివారం వచ్చారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి సత్కరించారు. జిల్లాలో అశావాహ జిల్లాగా చేపట్టిన కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరించారు.

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్స్&టీచర్స్ సమావేశం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 10న మెగా పేరెంట్&టీచర్స్ సమావేశంపై శనివారం సాయంత్రం కలెక్టర్ శ్యాం ప్రసాద్ వివరించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల కమిటీలు, పదోతరగతిలో ఉత్తమ ర్యాంకర్‌లు, పూర్వ విద్యార్థులు, తదితరులతో కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేస్తోందని వెల్లడించారు. అంతా తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News July 6, 2025

బిర్యానీ అంటే.. అదో ఎమోషన్!

image

‘వరల్డ్ బిర్యానీ డే’ ఒకటుందని తెలుసా? జులైలో తొలి ఆదివారాన్ని బిర్యానీ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఇది పర్షియా నుంచి ఉద్భవించిందని, మొఘలులు భారత్‌కు తెచ్చారని నమ్ముతారు. ఇందులో హైదరాబాదీ బిర్యానీ, లక్నో, కోల్‌కతా అంటూ చాలానే రకాలున్నాయి. వీటికి అదనంగా ఫ్రై పీస్, ఉలవచారు అంటూ మనోళ్లు చాలానే కనిపెట్టారు. మరి.. మీకే బిర్యానీ ఇష్టం? COMMENT చేయండి.