News February 2, 2025
జనగామ: 23 ప్రాక్టికల్ కేంద్రాలు.. 4,714 మంది విద్యార్థులు

రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జనగామ జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో జనరల్, వోకేషనల్ విద్యార్థులు 4,714 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
రూ.5 లక్షలకు అఖండ టికెట్ను కొనుగోలు చేసిన చిత్తూరు MLA

విడుదలకు సిద్ధమైన బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్టును చిత్తూరు MLA గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. గురువారం బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి సినిమా టికెట్టును అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. బాలకృష్ణ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. బాలకృష్ణ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
News December 4, 2025
అన్ని పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టాలి: PDPL DM&HO

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వి. వాణిశ్రీ గురువారం జిల్లా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికులు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషన్లు, హెల్త్ అసిస్టెంట్లతో విడతల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు, గర్భిణీ స్త్రీలకు ఎర్లీ రిజిస్ట్రేషన్, నాణ్యమైన పరీక్షలు, NCID స్క్రీనింగ్ పూర్తి చేయడం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
News December 4, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.


