News February 7, 2025

జనగామ: 30 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లా కలెక్టరేట్లోని సమాచార పౌరసంబంధాల శాఖ, విద్యా శాఖ, ఉద్యానవన శాఖ, పంచాయతీ శాఖతో పాటు పలు కార్యాలయాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సమయానుగుణంగా కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. సమయపాలన పాటించని 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు హాజరుకాని వారి వివరాలపై ఆరా తీశారు.

Similar News

News February 26, 2026

భద్రాద్రి కొత్త కలెక్టర్ అంకిత్ నేపథ్యం ఇదే..!

image

భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి అంకిత్ నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న ఆయన తాజా బదిలీలలో భాగంగా రానున్నారు. అంకిత్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం(BHU) నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. నిజామాబాద్‌లో పరిపాలనా వ్యవస్థలో అన్ని విభాగాల సమన్వయంలో కీలక పాత్ర పోషించారు.

News February 26, 2026

రైతు నేస్తం.. భద్రాద్రి కలెక్టర్ జితేష్‌ వి పాటిల్‌

image

భద్రాద్రి కలెక్టర్‌గా పనిచేసిన జితేష్‌ వి పాటిల్‌ TGNPDCL సీఎండీగా బదిలీ అయ్యారు. తన పదవీ కాలంలో నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ముఖ్యంగా సాగు రంగంలో వినూత్న మార్పుల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మునగ, ఆయిల్‌పామ్‌ సాగుతో పాటు చేపలు, బాతుల పెంపకం, వర్మీ కంపోస్టు తయారీపై రైతులను ప్రోత్సహిస్తూ రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు.

News February 26, 2026

ములుగు: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 45 మంది గైర్హాజరు

image

జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 1,832 మంది విద్యార్థులు ఉండగా, తొలి పరీక్షకు 1,787 మంది హాజరయ్యారు. 45 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఇంటర్ విద్య అధికారి వీరేందర్ తెలిపారు.