News February 7, 2025

జనగామ: 30 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లా కలెక్టరేట్లోని సమాచార పౌరసంబంధాల శాఖ, విద్యా శాఖ, ఉద్యానవన శాఖ, పంచాయతీ శాఖతో పాటు పలు కార్యాలయాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సమయానుగుణంగా కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. సమయపాలన పాటించని 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు హాజరుకాని వారి వివరాలపై ఆరా తీశారు.

Similar News

News March 23, 2025

సిద్దవటం: పూరిల్లు దగ్ధం.. వృద్ధుడు సజీవ దహనం

image

సిద్దవటం మండలంలోని మూలపల్లిలో పూరిల్లు దగ్ధం కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అయ్యవారి రెడ్డి స్వామి సమీపంలోని సత్రం వద్ద ఆదివారం పూరి ఇంట్లో ఉన్న పిల్లి రాజారెడ్డి(75) వృద్ధుడికి కంటి చూపు కనపడదన్నారు. కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తుండగా ప్రమాదవ శాత్తు పూరింటికి మంటలు అంటుకొని అగ్నికి ఆహుతయ్యాడన్నారు. ఒంటిమిట్ట సీఐ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News March 23, 2025

IPL-2025: చెన్నై, ముంబై జట్లు ఇవే

image

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో CSK టాస్ గెలిచి బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లను పరిశీలిస్తే..
CSK: రుతురాజ్ గైక్వాడ్(C), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, దూబే, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్ అహ్మద్, ఎల్లిస్, ఖలీల్ అహ్మద్
MI: రోహిత్, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ (C), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, సత్యనారాయణ రాజు

News March 23, 2025

పెంచికల్పేట్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: MLC

image

మారుమూల గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని MLC దండే విఠల్ పేర్కొన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లకు ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, దారుగపల్లి, చేడువాయి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!