News March 22, 2025
జనగామ: 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి: కలెక్టర్

రబీ సీజన్ 2024-25కి సంబంధించి ధాన్యం కొనుగోలుపై శనివారం జనగామ కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమావేశం నిర్వహించారు. మొత్తం 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా, అందులో 2,35,954 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 62,013 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, దొడ్డు రకం 1,73,941 మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేశామని చెప్పారు.
Similar News
News December 22, 2025
పెట్టుబడులు రావడం KCRకు ఇష్టం లేదేమో: మంత్రి శ్రీధర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని KCR ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై KCR కామెంట్లను ఆయన ఖండించారు. ‘పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం KCRకు ఇష్టం లేనట్టుంది. BRS హయాంలో జరిగిన చాలా ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు. అభివృద్ధికి దోహదపడేలా KCR సలహాలివ్వాలి. BRS నేతలు హైప్లో ఉన్నారు. మేం ప్రజలకు హోప్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 22, 2025
నెల్లూరు: కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ ఆవిష్కరణ

APSPDCLఆధ్వర్యంలో రూపొందించిన కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ను కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఆవిష్కరించారు. వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం, శుక్రవారం జనబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటించి వినియోగదారులతో మమేకం కానున్నారు.
News December 22, 2025
పుట్టపర్తిలో 330 అర్జీల స్వీకరణ

పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీలపై శ్రద్ధ పెట్టి ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. మొత్తం 330అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్కరించే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశామన్నారు.


