News February 3, 2025
జనగామ: 5న కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శన

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5న రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కిసాన్ మేళాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 20, 2025
రేపు మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి: కలెక్టర్

జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 966 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారిని అంగవైకల్యం నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 20, 2025
నల్గొండ: ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

నల్గొండ ఎన్జీ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మహాత్మా గాంధీ వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా.ఉపేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డా.సముద్రాల ఉపేందర్‌తో కలిసి ఫలితాలను ప్రకటించారు. నవంబర్ 2025లో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విద్యార్థులు కళాశాల వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
News December 20, 2025
శ్రీకాకుళం: ‘పోలియో విజయవంతం చేయాలి’

రేపు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని శ్రీకాకుళం DM&HO అనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆమె కార్యాలయ నుంచి ఏడూ రోడ్ల కూడలి వరకు ర్యాలీ ప్రారంభించారు. 0 – 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. శతశాతం లక్ష్యం సాధించేలా కృషిచేయాలన్నారు. మోబైల్ టీమ్‌లు ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయన్నారు.


