News February 14, 2025
జనగామ: GREAT.. ప్రేమ పెళ్లి.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన కుమార్-మమత 2009లో పెద్దల్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. కుమార్ తన చదువును మధ్యలో ఆపేసి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యని చదివించారు. 2020లో గురుకుల, హైస్కూల్ మమత పీఈటీగా సెలెక్ట్ అయి భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తోంది. కుమార్ వివిధ పనులు చేస్తూనే చదివి గురుకుల, హై స్కూల్ పీఈటీగా జాబ్ రాగా.. జనగామ జిల్లాలో పని చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
NKD: సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు

ఖేడ్ మండలంలో సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు నిలిచారు. పీర్ల తాండకు చెందిన సాలిబాయి, ఆమె మనువడు సచిన్ నామినేషన్ వేశారు. ఇరువురి నామినేషన్లు సక్రమంగానే ఉండగా ఈనెల 9న సచిన్ నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు. దీంతో సాలిబాయి ఏకగ్రీవం కానున్నారు. 8 వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో జీపీ పాలకవర్గం ఏకగ్రీవం అయినట్టే. ఈమె భర్త జీవులనాయక్ 1987లో ఖేడ్ ప్రథమ MPP అయ్యారు. ఈయన సర్పంచ్‌గానూ పనిచేశారు.
News December 7, 2025
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ, అలాగే మరికొందరికి స్థానచలనం కల్పిస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పటమట ఎస్ఐ కృష్ణ వర్మ, తిరువూరు ఎస్ఐ సత్యనారాయణను 5వ ట్రాఫిక్‌కు భవానీపురంలో ఉన్న ఆనంద్ కుమార్‌ను సైబర్ క్రైమ్‌కు సుమన్‌ను పీసీఆర్‌కు కొత్తపేటలో ఉన్న రాజనరేంద్రను గుణదల పోలీస్ స్టేషన్‌కు నందిగామలో ఉన్న శాతకర్ణిను తిరువూరుకు బదిలీ చేశారు.
News December 7, 2025
నిజామాబాద్: DCCలకు పరీక్ష

కొత్తగా ఎన్నికైన ఉమ్మడి NZB జిల్లా DCC అధ్యక్షులు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NZB DCC అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి, KMR DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఆలేను నియమించారు. కొత్తగా నియమితులైన వారి పని తీరును ఆరు నెలల పాటు పరిశీలిస్తామని ఇప్పటికే CM ప్రకటించారు. GP ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని వారిలో టెన్షన్ పట్టుకుంది.


