News March 7, 2025
జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: ఎంపీ

జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పరవాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రానికి సంబంధించి జనరిక్ మందుల షాపును శుక్రవారం ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్య ఖర్చులను తగ్గించడంలో జనరిక్ షాపులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2000కు పైగా జనరిక్ మందుల షాపులు ఉన్నాయన్నారు.
Similar News
News November 8, 2025
దేశంలోనే మొదటి పురోహితురాలు

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.
News November 8, 2025
వరంగల్: సెలవు పెడితే ప్రభుత్వానికి గండి

రిజిస్ట్రార్ సెలవు పెట్టిందే తడువు మూడు రోజుల్లో 21డాక్యుమెంట్లను ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్(జూనియర్ అసిస్టెంట్) రిజిస్టర్ చేసిన ఘటన HNK(D) భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. నిబంధనలకు విరుద్దంగా ఉనికిచర్లలోని 2 సర్వే నంబర్లలో నాన్ లేఅవుట్ వెంచర్లలో 15 ప్లాట్లు, 6 ఇండ్లు సహా మొత్తం 21 రిజిస్ట్రేషన్లు చేశాడు. నిబంధనల ప్రకారం నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు.
News November 8, 2025
కొలిమిగుండ్ల: వైరల్ ఫీవర్తో చిన్నారి మృతి

కొలిమిగుండ్లలోని అంకిరెడ్డిపల్లిలో వైరల్ ఫీవర్ సోకి విద్యార్థిని మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె పద్మిని(9) నాలుగో తరగతి చదువుతోంది. వారం రోజులుగా వైరల్ ఫీవర్, కామెర్లతో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఎంఈఓ అబ్దుల్ కలాం సంతాపం వ్యక్తం చేశారు.


