News December 28, 2024

జనవరి 1న శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అర్జిత సేవలను కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

Similar News

News January 19, 2025

కర్నూలు: ఘనంగా వేమన జయంతి 

image

యువత వేమన పద్యాల సారాంశాన్ని పాటించి అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. ఆదివారం కర్నూలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News January 19, 2025

తిక్కారెడ్డి సంచలన కామెంట్స్

image

టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారంటూ కర్నూలు <<15188222>>జిల్లా <<>>టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు రూ.5లక్షలకు డీలర్‌షిప్‌లు, నామినేటెడ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు.. కామెంట్ చేయండి.

News January 19, 2025

9వ రోజు 246 మంది అభ్యర్థుల ఎంపిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 9వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 338 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 246 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.