News January 21, 2025
జనవరి 21: చరిత్రలో ఈరోజు

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం
Similar News
News November 10, 2025
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా

చిన్నతనం నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకుని శాస్త్రవేత్త కావాలనుకున్నారు రీతూ కరిధాల్. లక్నోలో జన్మించిన ఈమె 1997లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్-2కు మిషన్ డైరక్టర్‌గా వ్యవహరించడంతో పాటు మార్స్ ఆర్బిటార్, మంగళయాన్, చంద్రయాన్-3లో ప్రధానపాత్ర పోషించారు. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా బిరుదుతోపాటు అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రోయంగ్ సైంటిస్ట్ అవార్డు, ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్-2020 జాబితాలో నిలిచారు.
News November 10, 2025
శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి?

☛ విషాన్ని ఆయన గొంతులోనే ఉంచుకొని లోకాన్ని రక్షించినట్లు, మన జీవితంలోని ప్రతికూలతలను నియంత్రించడం నేర్చుకోవాలి.
☛ ఆయన నుదుటిపై మూడో కన్ను జ్ఞానం, వివేకానికి చిహ్నం. అలాంటి వివేకంతో సత్యాసత్యాలను, మంచి-చెడులను గుర్తించే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
☛ శివుడు భస్మం, రుద్రాక్షలతో నిరాడంబరంగా ఉంటాడు. నిజమైన శక్తికి ఆడంబరాలు అనవసరమని అర్థం. ☛ ధ్యానంతో మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంచుకోవాలి.
News November 10, 2025
రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం

AP: రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి, ఏపీ నైబర్ హుడ్ పాలసీ, డ్రోన్ సిటీ భూ కేటాయింపు పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో ఐటీ కంపెనీలకు రోడ్డు విస్తరణకు నిర్ణయం తీసుకుంది. విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ఐటీ క్యాంపస్‌కు 2 ఎకరాలు, ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ క్యాంపస్‌కు 3.3 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.


