News January 13, 2025

జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం: పెద్దపల్లి ఎమ్మెల్యే

image

ఈనెల 26 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు. భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, తదితర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 18, 2025

కరీంనగర్: జీవం తీస్తున్న ఆన్లైన్ జూదం..!

image

ఇద్దరు యువకులు ఆన్‌లైన్ మోసాలకు బలైన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. గద్దపాకకి చెందిన భూస కార్తిక్(25) ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ.15లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పలపల్లికి చెందిన ఎడిగమధు(35) అనే యువ రైతు ఆన్‌లైన్ జూదంలో రూ. 10 లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 18, 2025

కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

image

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

కరీంనగర్: కాలువలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాకతీయ కెనాల్ కాలువలోకి దూకి సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి కాలువలో దూకి ఆ యువతిని కాపాడామన్నారు. ఆత్మహత్య యత్నించిన ఆమె కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన యువతికి గుర్తించామని తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి తీసుకెళ్లారన్నారు. 

error: Content is protected !!