News December 22, 2024
జనవరి 29 నుంచి దేవుని కడప శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News January 22, 2025
కడప: ‘నేరస్థులకు శిక్ష.. బాధితులకు న్యాయం’
నేరం చేసిన వారికి శిక్ష, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో కడప, అన్నమయ్య జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో, నిబద్ధతతో నేరాల కట్టడికి కృషి చేయాలన్నారు.
News January 22, 2025
కడప నగరం వరకే సెలవు
కడపలో ఇవాళ అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరాముడి కళ్యాణం, శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈవెంట్ నిర్వాహకులు, పాఠశాలల టీచర్ల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు నేడు(బుధవారం) సెలవు ప్రకటించారు. ఈ సెలవు కేవలం కడప నగరం వరకే వర్తిస్తుంది. జిల్లాలోని ఇతర విద్యా సంస్థలు పనిచేస్తాయి. తామూ శోభాయాత్రకు వెళ్తామని.. తమకూ సెలవు కావాలని కడప పరిసర మండల వాసులు కోరుతున్నారు.
News January 22, 2025
శోభాయాత్రకు పకడ్బందీగా బందోబస్తు: డీఎస్పీ
కడపలో ఈరోజు ఉదయం అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే శ్రీరాముడి కళ్యాణం శోభాయాత్రకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప సబ్ డివిజన్ పరిధిలోని 9 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లర్లకు ఎవరైనా పాల్పడిన ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు.