News January 3, 2025

జనవరి 4న విశాఖకు సీఎం.. షెడ్యూల్ ఇదే 

image

విశాఖలో జనవరి 4న జరగనున్న నేవీ విన్యాసాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. శనివారం మధ్యాహ్నం 3:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆర్‌కె బీచ్‌కు వెళ్లి నేవీ విన్యాసాలు తిలకిస్తారు. 6:15 నిముషాలకు ఆర్‌కె బీచ్ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రోడ్డు మార్గన వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు.

Similar News

News January 8, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్‌కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్‌లోని ఫ్రెండ్స్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 8, 2026

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఘన స్వాగతం

image

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి విశాఖలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

News January 8, 2026

విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

image

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.