News February 25, 2025

జనసంద్రంగా శ్రీశైలం

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లన్నను దర్శించుకుని సాయంత్రం జరిగే ఉత్సవాలను తిలకించి భక్తులు తరిస్తున్నారు.

Similar News

News March 20, 2025

రేపు కరీంనగర్‌కు రైల్వే జీఎం రాక

image

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం కరీంనగర్ రానున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద కరీంనగర్, రామగుండం రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జీఎం అరుణ్ కుమార్ ప్రత్యేక రైలులో ఉన్నత అధికారులతో కలిసి ఉదయం 8:30 గంటలకు కరీంనగర్ చేరుకుని రైల్వేస్టేషన్ను తనిఖీ చేసి, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం మ.1:00 వరకు రామగుండం వెళ్ళనున్నారు.

News March 20, 2025

రెండో భర్తతో సింగర్ విడాకులు

image

ప్రముఖ సింగర్ సియా ఫర్లర్ తన రెండో భర్త డేనియల్ బెర్నాడ్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత వారిద్దరు వేరుకానున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. విడాకుల కోసం సియా కోర్టును ఆశ్రయించినట్లు పీపుల్ మ్యాగజైన్ పేర్కొంది. ఆమె పాడిన <>చీప్ థ్రిల్స్ ఆల్బమ్<<>> సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. ఓన్లీ సీ, హీలింగ్ డిఫికల్ట్, కలర్ ది స్మాల్ వన్ వంటి ఆల్బమ్స్ సియా ఖాతాలో ఉన్నాయి.

News March 20, 2025

గన్నవరం: బాలికపై అఘాయిత్యం.. వెలుగులోకి కీలక విషయాలు

image

గన్నవరం మండలంలో బాలికపై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అపహరించి 14 మధ్యాహ్నం వరకు పారిశ్రామికవాడలో నిర్బంధించారు. 14న కేసరపల్లిలో ఖాళీ గదికి తరలించి, 17వరకు మద్యం, గంజాయి ఇచ్చి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం విజయవాడలో వదిలేశారు. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారంతా గంజాయి కేసుల్లో పాత నేరస్థులని గుర్తించారు.

error: Content is protected !!