News March 15, 2025
జనసేనను బీజేపీలో విలీనం చేయడం మంచిది: తులసి రెడ్డి

జనసేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి పవన్ కళ్యాణ్‌కు సూచించారు. శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ల ముగ్గురూ కీలు బొమ్మలని అన్నారు. అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందన్నారు.
Similar News
News November 23, 2025
అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
News November 23, 2025
చిలకపాలెం-రాయగడ రోడ్డు పనులకు రేపు శంకుస్థాపన

చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో బేబినాయన కోరడంతో రూ.4.50కోట్లు మంజూరయ్యాయి. గొర్లెసీతారాంపురం వద్ద శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 23, 2025
ఈ నెల 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

ఈ నెల 28న రాజధాని అమరావతిలో పలు బ్యాంక్ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ బ్యాంకులకు CRDA భూకేటాయింపులు చేసింది. శంకుస్థాపన అనంతరం CRDA ప్రధాన కార్యాలయం దగ్గర సభకు నిర్మలా సీతారామన్, పెమ్మసాని, చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు.


