News February 28, 2025
జనసేనలోకి శిద్ధా రాఘవరావు..?

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారట. అవేమీ కుదరకపోవడంతో ఇప్పుడు జనసేన గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంట. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా శిద్ధాను జనసేనలోకి ఆహ్వానించారంట.
Similar News
News April 23, 2025
10th RESULTS: 9వ స్థానంలో ప్రకాశం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లా 85.43%తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. మొత్తం 29,386 మంది పరీక్షలు రాయగా 25,103 మంది పాసయ్యారు. 14,880 బాలురులో 12,480 మంది, 14,506 మంది బాలికలు పరీక్ష రాయగా 12,623 మంది పాసయ్యారు.
News April 23, 2025
వెంటిలేటర్పై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే?

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత వీరయ్య చౌదరిపై హత్య జరిగడంతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ఆయన్ను ఒంగోలులో సంఘమిత్ర హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. ECG తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. హరిబాబు హెల్త్ అప్డేట్పై హోం మంత్రి అనిత ఆరా తీశారు.
News April 23, 2025
ఒంగోలు: వార్డు మెంబర్ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి వరకు

ఒంగోలులో దారుణంగా హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఈయన 2013 నుంచి 2018 వరకు అమ్మనబ్రోలు గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్గా ఎన్నికై అనంతరం ఉపసర్పంచ్గా ఉన్నారు. అనంతరం చవటపాలెం ఎంపీటీసీగా ఎన్నిక కాబడి నాగులుప్పలపాడు ఎంపీపీగా ఐదు సంవత్సరాలు ఉన్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.