News February 28, 2025
జనసేనలోకి శిద్ధా రాఘవరావు..?

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారట. అవేమీ కుదరకపోవడంతో ఇప్పుడు జనసేన గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంట. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా శిద్ధాను జనసేనలోకి ఆహ్వానించారంట.
Similar News
News March 26, 2025
ప్రకాశం: పొగాకు గరిష్ట ధర రూ.280

ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పొగాకు వేలంలో, క్వింటా గరిష్టంగా రూ.280 ధర పలకగా కనిష్టంగా రూ.260 పలికినట్లు వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే సరాసరి ధర రూ.275 పలికింది. కాకుటూరువారి పాలెం, శివపురం గ్రామాల నుంచి రైతులు 296 బేళ్లు వేలానికి తెచ్చారు. ఇందులో 232 బేళ్లను కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 64 పొగాకు బేళ్లను కొనుగోలు చేయలేదు.
News March 25, 2025
ప్రకాశం: DSC అభ్యర్థులకు GOOD NEWS

ప్రకాశం జిల్లాలోని EBC, BC అభ్యర్థులకు మెగా DSC-2025కి ఆన్‌లైన్ ద్వారా, ఉచిత శిక్షణ ఇస్తామని ఏపీ BC స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకురాలు అంజలి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హత, ఆధార్, టెట్ మార్కుల జిరాక్సులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలన్నారు. అన్నింటితోపాటు 2 పాస్ ఫొటోలను కలిపి ఒంగోలులోని ఏపీ BC స్టడీ సర్కిల్ ఆఫీసులో సమర్పించాలని కోరారు. ధరఖాస్తులు 10వ తేదీనే ప్రారంభం అయినట్లు తెలిపారు.
News March 25, 2025
ఒంగోలు: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

ఏపీపీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీపీఎస్‌సీ పరీక్ష జరుగుతున్న ఒంగోలులోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్, సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.