News October 19, 2024
జనసేనలో చేరిన కూతురు.. ముద్రగడ స్పందించేనా?

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరడంతో తూ.గో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల వేళ పవన్కు జైకొట్టిన ఆమె ఇవాళ జనసేన కండువా కప్పుకున్నారు. తన కుటుంబాన్ని విడదీసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ముద్రగడ ఆరోపించగా.. తాజాగా క్రాంతి చేరికపై ఆయన ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు క్రాంతికి కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్..
Similar News
News November 8, 2025
రాజమండ్రి: నేడు యథావిధిగా పాఠశాలలు

జిల్లాలో రెపు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని డీఈఓ వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలకు ప్రభుత్వం అక్టోబర్ నెల 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సెలవుల స్థానంలో వీటిని భర్తీ చేస్తున్నామన్నారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 14 రెండవ శనివారాల్లో పాఠశాలలు విధిగా పనిచేయాలని విద్యాశాఖ ఆదేశించినట్లు డీఈవో చెప్పారు.
News November 8, 2025
ముంపు నివారణ చర్యలపై సమగ్ర ప్రణాళిక అవసరం: కలెక్టర్

తూ.గో జిల్లాలో ఇటీవల వరదలు, అధిక వర్షాల కారణంగా ప్రభావితమైన గ్రామాలలో ముంపు పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర నివారణ చర్యలు అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాను వల్ల పలు గ్రామాల్లో పంటలు ముంపుకు గురై రైతులు నష్టపోయారని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 7, 2025
గోపాలపురం: కొడవలితో భార్యపై భర్త దాడి

భార్యపై అనుమానంతో భర్త కొడవలితో దాడి చేసిన ఘటన గోపాలపురం మండలం దొండపూడి మేదరపేటలో జరిగింది. ఎస్ఐ మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింధూజపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త కాసాని రామకృష్ణ మద్యం మత్తులో వచ్చి దాడి చేశాడు. సింధూజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


