News March 2, 2025

జనసేన కమిటీలో ప్రకాశం జిల్లా నేతలకు కీలక బాధ్యతలు.!

image

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను మార్చి 14న పిఠాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నిర్వహణ కోసం కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో, జిల్లా జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం జనసేన ఇన్‌ఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్‌లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించినట్లుగా పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Similar News

News January 8, 2026

సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలి: కలెక్టర్

image

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.

News January 8, 2026

త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

image

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.

News January 8, 2026

ప్రకాశంలో మొదలైన సంక్రాంతి సందడి

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కొన్ని కళాశాలల్లో భోగి మంటలు వేసి విద్యార్థులకు పండగ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు.