News April 18, 2024
జనసేన తీర్థం పుచ్చుకున్న వట్టి పవన్ కుమార్

మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం ఏం.ఏం పురం గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా భుజాన వేసి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వట్టి పవన్ కుమార్ స్పష్టం చేశారు.
Similar News
News December 19, 2025
ముళ్లపూడి బాపిరాజుకు మరోసారి నిరాశ.?

జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆశించిన ఉమ్మడి ప.గో. జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకి నిరాశే ఎదురైంది. కష్ట కాలంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. టీపీగూడెం నుంచి బాపిరాజు టికెట్టు ఆశించినా.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించారు. కనీసం పార్టీలో నామినేటెడ్ పదవి దక్కుతుందనుకున్న బాపిరాజుకు మరోసారి నిరాశ ఎదురయింది.
News December 19, 2025
ప.గో: బ్యాంకులో రూ. కోట్లు మాయం

ఆకివీడులో ఇటీవల డ్వాక్రా సంఘాల సొమ్మును యానిమేటర్లు రూ. కోట్లలో స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు యానిమేటర్లు రూ. 2.36 కోట్లు మాయం చేసినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు.19 డ్వాక్రా సంఘాలలో సుధారాణి రూ.1.39 కోట్లు,13 గ్రూపులకు సంబంధించి హేమలత రూ.96 లక్షల స్వాహా చేసినట్లు అధికారులు తేల్చారు. శుక్రవారం ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు.
News December 19, 2025
ధాన్యం కొనుగోలు పురోగతిపై జేసీ సమీక్ష

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని జేసీ రాహుల్ అన్నారు. జేసి ఛాంబర్లో గురువారం ధాన్యం కొనుగోలు పురోగతిపై అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై ధాన్యం సేకరణ కేంద్రాలు పనితీరు, రైతులు చెల్లింపులు లక్ష్యాలు, సాధనపై అడిగి తెలుసుకున్నారు.


