News April 25, 2024
జనసేన నేత బొబ్బేపల్లిపై తిరుగుబాటు

జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడిపై ఆ పార్టీకి చెందిన 5 మండలాల అధ్యక్షులు తిరుగుబాటుకు దిగారు. వెంకటాచలంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే జన సైనికులపై ఆయన దూషణలకు దిగడం సరికాదన్నారు. ఆయన తీరు నచ్చకే కొందరు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారన్నారు. అతనితో కలిసి పనిచేయబోమని.. తామంతా సోమిరెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు.
Similar News
News December 13, 2025
నేడు కాణిపాకంలో నెల్లూరు కార్పొరేటర్ల ప్రమాణం.?

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఘట్టం <<18549066>>వైకుంఠపాళి<<>>ని తలపిస్తోంది. అవిశ్వాసాన్ని నెగ్గించాలని TDP, అడ్డుకోవాలని YCP పావులు కదుపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు ‘<<18540168>>జంపింగ్ జపాంగ్<<>>’లా మారారు. ఎలాగైనా తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలని TDP వారిని తిరుపతి తరలించిందట. మరికాసేపట్లో వారిని కాణిపాకం తరలించి ‘మేము TDPలోనే కొనసాగుతాం’ అని ప్రమాణం చేయించనున్నారట.
News December 13, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

హ్యాండ్లూమ్, టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్‌కు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా ఆయా విభాగాలకు సంబంధించిన నిర్దేశించిన ఫీజులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరారు.
News December 13, 2025
తిరుపతి చేరిన నెల్లూరు రాజకీయం.?

నెల్లూరు మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మాన ఘట్టం పొలిటికల్ హీట్ పెంచింది. 18న ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలని మంత్రి నారాయణ, MLA కోటంరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దాదాపు 37 మంది కార్పొరేటర్లు TDPకి మద్దతు పలుకుతుండగా వారిని తిరుపతికి తరలించినట్లు సమాచారం. జగన్ సమక్షంలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలలో మరో ఇద్దరు TDP చెంతకు వచ్చారు. అవిశ్వాసం నెగ్గాలంటే 38 సభ్యులు కావాలి.


