News March 24, 2025
జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా గుమ్మనూరు..?

జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుమ్మానూరు నారాయణకు బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. విజయవాడలో ఆపార్టీ నేతలతో నారాయణ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దూకుడైన యువనేత అవసరమని భావిస్తోన్న పార్టీ.. నారాయణకే బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో గుమ్మానూరు కుటుంబానికి బలమైన క్యాడర్ ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News October 31, 2025
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో 91 శాఖల అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన పెంచాలని, నాబార్డ్ ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.
News October 31, 2025
మ్యాట్రి’మనీ’ మోసాలపై కర్నూలు ఎస్పీ హెచ్చరిక

వివాహ సంబంధిత వెబ్‌సైట్లు, యాప్‌లు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం హెచ్చరించారు. నకిలీ పేర్లు, ఆకర్షణీయమైన ఫొటోలతో కూడిన ప్రొఫైల్స్ నమ్మి అమాయకులు మోసపోతున్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. మోసపోయిన వారు ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం www.cybercrime.gov.inలో సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
News October 30, 2025
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల అందజేత

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తరఫున ప్రతినిధులు 19 మంది మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన నలుగురికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు. ఈ చెక్కును కలెక్టరేట్‌లో మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి సమక్షంలో అందజేశారు.


