News August 7, 2024

జనసేన సభ్యత్వంలో జిల్లాలో ఉదయగిరి మూడో స్థానం

image

జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన సభ్యత్వంలో నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మూడో స్థానంలో నిలిచిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భోగినేని కాశీరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వాలు 4 విడుదలలో ఉదయగిరి నియోజకవర్గంలో 4 వేలు పైచిలుకు సభ్యత్వాలు వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 7, 2025

సైదాపురం : వంతెనకు మరమ్మతులు చేయరూ?

image

సైదాపురం నుంచి గూడూరుకి వెళ్లే ప్రధాన రహదారిలో కైవల్య నదిపై వంతెన ఉంది. ఇది రాజంపేట నుంచి గూడూరుకి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.12 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనపై గుంత ఏర్పడి కమ్మీలు బయటపడటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

News December 7, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

image

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.

News December 7, 2025

నెల్లూరులో స్పా సెంటర్లపై దాడులు..10 మంది యువతుల అరెస్ట్

image

నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగాపురం, జగదీశ్ నగర్ సెంటర్లో ఉన్న Unisex, VIP స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురు యువతులతో పాటు ఒక విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కృష్ణవేణితో పాటు, సుధీర్‌పై కేసులు నమోదు చేస్తామని సీఐ సాంబశివరావు తెలిపారు. వేదాయపాళెం నిప్పో సెంటర్ వద్ద ఓ స్పా సెంటర్‌పై దాడులు చేసి ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.