News August 7, 2024
జనసేన సభ్యత్వంలో జిల్లాలో ఉదయగిరి మూడో స్థానం
జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన సభ్యత్వంలో నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మూడో స్థానంలో నిలిచిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భోగినేని కాశీరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వాలు 4 విడుదలలో ఉదయగిరి నియోజకవర్గంలో 4 వేలు పైచిలుకు సభ్యత్వాలు వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 14, 2024
మాజీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్
మాజీ సీఎం జగన్‌కి సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయవాడకు వచ్చిన వరదలపై జగన్ విమర్శిస్తున్న తీరును తప్పుబట్టారు. విపత్తులు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అయితే , రూ. లక్షల కోట్లు దాచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
News September 14, 2024
నెల్లూరు: ఈనెల 20న మెగా జాబ్ మేళా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణాభివృద్ధి అధికారి సి. విజయవినీల్ కుమార్ తెలిపారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో ఉదయం 9.30 – 2 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 10,ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు.
News September 14, 2024
సూళ్లూరుపేట: మిస్సైన అమ్మాయి ఆచూకీ లభ్యం
సూళ్లూరుపేట పట్టణంలో శుక్రవారం ట్యూషన్ కోసమని ఇంటి నుంచి వెళ్లి ఆఫ్రీన్(12) మిస్సైన సంగతి తెలిసిందే. అయితే బాలిక ప్రస్తుతం చెన్నై పోలీసుల చెంత సురక్షితంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పాప చెన్నైకి వెళ్లి ఓ ఆటో ఎక్కి తనను బీచ్ వద్దకు చేర్చమని ఆటో వ్యక్తికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు కుటుంబీకులు సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు.