News March 30, 2024
జన్నారంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలోని డీర్ పార్క్ వద్ద ప్రధాన రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలేరో.. జన్నారం వైపు వస్తున్న బైక్ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మందపల్లి గ్రామానికి చెందిన దేవి సుదర్శన్ (45) రక్షిత్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 13, 2025
నేడు ఆసిఫాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క రాక
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నట్లు మంత్రి పీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెబ్బన, వాంకిడి, కెరమెరి మండలాల్లో జంగు బాయి దేవత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
News January 13, 2025
ADB: జనవరి 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో MRPS నాయకుడు ఎల్లన్న ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూర్యప్రసాద్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యదర్శిగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. ఈనెల 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ వస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
News January 13, 2025
సిర్పూర్(టి): పశువుల రవాణా.. ముగ్గురి ARREST
అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో ఆదివారం పట్టుకున్నారు. అనంతరం పశువులను గోశాలలకు తరలించి, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.