News January 25, 2025
జన్నారం: అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..!

జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేష్ బెహరన్ దేశంలో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు తిమ్మాపూర్‌లో జరిగాయి. అతని బావమరిది భార్య లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రజిత (30) ద్విచక్ర వాహనంపై నుంచి పడడంతో మేదర్‌పేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Similar News
News November 25, 2025
NTR: జోగి రమేష్‌కి రిమాండ్ పొడిగింపు

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దనావుతో సహా ఏడుగురు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
News November 25, 2025
లిప్స్కీ LED మాస్క్

ప్రస్తుతం LED మాస్క్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్‌ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.
News November 25, 2025
ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.


