News January 25, 2025
జన్నారం: అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..!

జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ బహ్రెయిన్ దేశంలో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు తిమ్మాపూర్‌లో జరిగాయి. అతని బావమరిది భార్య లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రజిత (30) ద్విచక్ర వాహనంపై నుంచి పడడంతో మేదర్‌పేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Similar News
News February 12, 2025
42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఆర్ కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
News February 12, 2025
ఇంద్రవెల్లి: మాజీ సర్పంచ్ మృతి

ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News February 12, 2025
పెద్దపల్లి: 3 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి: భూనిర్వాసితులు

పెద్దపల్లి- కూనారం ఆర్ఓబీ ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితులు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ విలువకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వాస్తవ మార్కెట్ ధర కన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వాలని చూస్తోందని భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం విషయంలో తగిన న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.