News February 7, 2025

జన్నారం: ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన రాపాల రాజు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జన్నారం పట్టణంలోని రామ్ నగర్కు చెందిన డాక్టర్ రాపాల రాజు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. రాపాల రాజు మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. 

Similar News

News October 27, 2025

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో సోమవారం కావడంతో భక్తులు ఉపవాస దీక్షలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

News October 27, 2025

JGTL: మున్సిపాలిటీలకు నిధులు.. జిల్లాలో ‘క్రెడిట్ వార్’

image

కోరుట్ల- మెట్‌పల్లి మున్సిపాలిటీల(ఒక్కోదానికి రూ.18.70 కోట్లు)కు రాష్ట్ర ప్రభుత్వం రూ.37.40 కోట్లు UIDF పథకం కింద మంజూరు చేసింది. అయితే ఈ నిధులు తేవడం విషయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మధ్య ‘క్రెడిట్ పోటీ’ నెలకొంది. మరోవైపు బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం వల్లే ఈ నిధులు మంజూరు అయినట్లు సోషల్ మీడియాలో తెగప్రచారం చేస్తూ స్టేటస్లు వైరల్ చేస్తున్నారు.

News October 27, 2025

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే?

image

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండనున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎంకు నివేదిక పంపనుంది. అయితే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం-శ్రీశైలం 81KM, నంద్యాల-శ్రీశైలం 160KM. మార్కాపురానికి దగ్గరగా ఉందన్న కారణంతోనే కొందరు శ్రీశైలాన్ని ఆ జిల్లాలో కలపాలనే వినతులు సమర్పించారట.