News February 7, 2025
జన్నారం: ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన రాపాల రాజు

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జన్నారం పట్టణంలోని రామ్ నగర్కు చెందిన డాక్టర్ రాపాల రాజు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. రాపాల రాజు మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు.
Similar News
News March 15, 2026
అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2026
‘భీష్మ ప్రతిజ్ఞ’ అంటే ఏమిటి?

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ల గురించి చెప్పే సందర్భంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ నానుడిని వాడతారు. భారతంలో భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె సత్యవతిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటాడు. తన కూతురి కొడుకే రాజు కావాలని దాశరాజు కోరగా తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు అంగీకరించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారు. అందుకే ఆయనకు భీష్ముడిగా పేరు వచ్చింది.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 15, 2026
పుట్టపర్తిలో అధికారులతో కలెక్టర్ సమీక్ష

పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగుదొడ్లలో 3,725 పనులు పూర్తయ్యాయని, మిగిలినవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు రూ.299.37 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.


