News April 8, 2025
జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 10, 2025
బాలికపై మంచిర్యాల యువకుల అత్యాచారం

సంగారెడ్డికి చెందిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ తెలిపారు. ఈనెల 4న అదృశ్యమైన బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 8న బాలిక సికింద్రాబాద్లో ఉండగా, మంచిర్యాలకు చెందిన ఇద్దరు మైనర్లు, ఇద్దరు యువకులు ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు.
News December 10, 2025
అమరావతికి రానున్న జాతీయ ఫోరెన్సిక్ వర్సిటీ

ఉగాండా హత్యకేసులో హంతకుడిని DNAతో పట్టించిన అదే NFSEU త్వరలో అమరావతిలో నెలకొననుంది. హత్యాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను, సీసీ టీవీ పుటేజీలను శాస్త్రీయంగా విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన వర్సిటీ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశంలో ఉగ్రవాద కేసుల దర్యాప్తుల్లోనూ ఈ వర్సిటీ కీలక పాత్ర పోషించింది. అమరావతిలో శాఖ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు CM చంద్రబాబుకు ఇచ్చినట్లు వీసీ తెలిపారు
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


