News April 11, 2024

జన్నారం: కడుపునొప్పి భరించలేక మహిళా ఉద్యోగి మృతి

image

కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి మహిళా మృతిచెందిన ఘటన జన్నారం మండలం మురిమడుగులో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల వివరాలిలా.. గద్దల నవ్య (28 ) ఉట్నూర్ RDO కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బుధవారం నొప్పి తీవ్రమవ్వడంతో బాధ భరించలేక పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందింది.

Similar News

News March 22, 2025

ADB: పరీక్షకు 23 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,039 మంది విద్యార్థులకు గాను 10,016 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించినట్లు వివరించారు.

News March 22, 2025

గుడిహత్నూర్: బాలికకు అబార్షన్.. RMP అరెస్ట్

image

బాలికకు అబార్షన్ చేసిన కేసులో RMP వైద్యుడు సూర్యవంశీ దిలీప్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామంలో ఇటీవల పసికందు మృతదేహం లభ్యం అవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా 15 ఏళ్ల మైనర్ బాలికకు అబార్షన్ చేసినట్లు గుర్తించారు. దీంతో అతడి క్లినిక్‌ను సీజ్ చేసి అరెస్ట్ చేశారు.

News March 22, 2025

ADB: ఈ నెల 23 నుంచి రెండో విడత కరెక్షన్

image

ఆదిలాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న వృక్షశాస్త్రం,జంతుశాస్త్ర అధ్యాపకులు ఇంటర్మీడియట్ రెండో విడత మూల్యాంకనంలో పాల్గొనాలని DIEO జాధవ్ గణేశ్ సూచించారు. ఈ నెల 23న జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ నెల 24 భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం మూల్యంకనం జరుగుతుందన్నారు. అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని కోరారు.

error: Content is protected !!