News July 15, 2024

జన్నారం: కవ్వాలో అడవి దున్నల సందడి

image

కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి దున్నలు సందడి చేస్తున్నాయి. కొంతకాలంగా కంటికి కనిపించకుండా పోయిన అడవి దున్నలు ఇప్పుడు బైసన్ కుంట వద్ద గుంపుగా వచ్చి మేత మేస్తున్నాయి. నీలుగాయి కుంట సమీపంలో, మైసమ్మకుంట వద్ద సేద తీరుతూ మరో అడవి దున్న కెమెరాకు చిక్కింది. సోమవారం అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసిన ఆడవి దున్నలు అధికంగా సందడి. చేస్తూ ఆకట్టుకున్నాయి. నిజానికి అడవిలోకి వెళ్లేందుకు ఇప్పుడు పర్యాటకులకు అనుమతి లేదు.

Similar News

News October 14, 2024

ADB: మళ్లీ పులి వచ్చింది

image

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు నెలల్లో పరందోలి, కరంజివాడ, లక్మాపూర్, ఇందాపూర్ ప్రాంతాల్లో పులి సంచరించగా స్థానికులు ఆందోళన చెందారు. తాజాగా ఇదే మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలియడంతో జంకుతున్నారు. మరోవైపు ఆయా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోడేఘాట్ FRO జ్ఞానేశ్వర్ సూచిస్తున్నారు.

News October 14, 2024

ఆదిలాబాద్ MP నేటి పర్యటన ఇలా..

image

ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ నేడు (సోమవారం) సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివరాలు ఇలా.. కాగజ్‌నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అలాయ్- బలాయ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు దహెగాం ప్రెస్‌క్లబ్ మొదటి వార్షికోత్సవానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రంలో, 4 గంటలకు ఈస్గాంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

News October 13, 2024

బాసర అమ్మవారికి దిల్ రాజు పూజలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.