News May 26, 2024
జన్నారం: కారు ఢీకొని ఉపాధి హామీ కూలీ మృతి

జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన కందుల లచ్చన్న అనే ఉపాధి హామీ కూలీ కారు ఢీకొని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కందుల లచ్చన్న శనివారం ఉపాధి హామీ పనిని ముగించుకొని వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారు ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో లచ్చన్నకు గాయాలు కాగా కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట, కరీంనగర్ అటు నుంచి హైదరాబాద్ నిమ్స్ తరలించగా అక్కడ మృతి చెందారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 9, 2025
ADB ఎస్పీ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పెళ్లి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం భోదిలో జరిగిన రిసెప్షన్‌లో కలెక్టర్ రాజర్షి షా ఆయన భార్య నితికా పంత్‌తో కలిసి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, తదితరులు ఉన్నారు.
News February 9, 2025
ఆదిలాబాద్: ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సునీల్ వివరాల ప్రకారం.. స్థానిక సీసీఐ ఫ్యాక్టరీ వద్ద శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంగా రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రదీప్, జగేశ్వర్ ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
News February 9, 2025
ఆదిలాబాద్: మహిళలకు GOOD NEWS.. 11న జాబ్ మేళా

ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 TASK ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన GLITZ CORP ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.అతీక్ బేగం పేర్కొన్నారు. 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15వేల జీతంతో పాటు, భోజనం, రవాణా సౌకర్యం, వసతి నెలకు అలవెన్స్ ఉంటుందన్నారు.