News January 27, 2025

జన్నారం: పడగ విప్పిన పాములా బండరాయి

image

జన్నారం మండలంలోని ఇందన్పల్లి అటవీ రేంజ్‌లో ఉన్న అడవిలో ఓ రాయి పడగ విప్పిన పాములా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మైసమ్మ కుంట నుంచి గనిశెట్టి కుంటకు వెళ్లే మార్గంలో అడవి మధ్యలో పడగ విప్పిన పాము మాదిరిగా రాయి దర్శనమిచ్చింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది బండ రాయిగా కనిపిస్తుందని ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. అయితే అటవీ నిబంధనలు ఉండటంతో దాని సందర్శనకు అనుమతి లేదన్నారు.

Similar News

News March 12, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు (బుధవారం) విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వల్లభనేని వంశీ పై పలు కేసులు నమోదయ్యాయి.

News March 12, 2025

NLG: GGHలో భద్రత డొల్ల!…

image

NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

News March 12, 2025

ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు జి. జయ లక్ష్మి (IAS) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

error: Content is protected !!