News February 8, 2025
జన్నారం: ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు ఎమ్మెల్యే.

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించి విధించిన ఆంక్షలు ఎత్తివేయడం జరిగిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఈ విషయంపై చీప్ కన్జర్వేటర్‌కు శుక్రవారం వినతి పత్రం అందించామన్నారు. స్పందించిన CCF ఆధారాలు చూపించి రాకపోకలు సాధించుకోవచ్చు సాగించుకోవచ్చని తెలిపినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
కామారెడ్డి: మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి

మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలని కామారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల అన్నారు. పని చేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 9, 2026
నియోజకవర్గాలకు ర్యాంకులు.. విజయవాడ వెస్ట్ టాప్

AP: MLAల పనితీరు, పథకాల అమలు ఆధారంగా 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 21 నియోజకవర్గాలు A+ గ్రేడ్ సాధించగా, A గ్రేడ్‌లో 153 నిలిచాయి. ఒకే ఒక్క నియోజకవర్గం B గ్రేడ్‌కు పరిమితమైంది. 93% మార్కులతో NTR జిల్లాలోని విజయవాడ వెస్ట్ నంబర్ వన్‌గా నిలిచింది. దీనికి సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాజువాక, కాకినాడ సిటీ, విజయవాడ ఈస్ట్.. 2,3,4 ర్యాంకులు సాధించాయి.
News February 9, 2026
కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
☛ నంద్యాల ఫ్యాక్షన్ జోన్‌కు ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ సీఐ రియాజ్ అహ్మద్ బదిలీ
☛ గోవిందరెడ్డి కడప VR నుంచి ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ బదిలీ
☛ దస్తగిరి కడప VR నుంచి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్‌కు బదిలీ
☛ లింగప్ప బద్వేల్ నుంచి మన్నూరుకు బదిలీ
☛ రామకృష్ణ సత్యసాయి జిల్లా నుంచి బద్వేల్‌కు బదిలీ.


