News March 5, 2025
జన్నారం: ప్రభుత్వ పాఠశాలలతో మంచి భవిష్యత్తు: DEO

ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మంచిర్యాల DEO యాదయ్య అన్నారు. జన్నారం మండలం అక్కపెల్లిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. MEO విజయ్ కుమార్, HM శ్రీనివాస్, రాజమౌళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News December 16, 2025
డేంజర్లో హైదరాబాద్

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.
News December 16, 2025
బాలయ్య నోట మరో పాట.. సాహోరే బాహుబలి తరహాలో!

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా కోసం మరోసారి సింగర్గా మారబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు. సాహోరే బాహుబలి సాంగ్ తరహాలో ఈ పాట ఉంటుందని తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. కాగా బాలయ్య గతంలో ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్ లా’ అనే సాంగ్ పాడారు. అప్పుడప్పుడూ మూవీ ఈవెంట్లలోనూ ఆయన తన సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తుంటారు.
News December 16, 2025
రామగుండం: ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అమల్లో BNSS’

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని 9 మండలాల్లో 5 మందికిపైగా గుమిగూడద్దన్నారు. చట్టబద్ధమైన సమావేశం కోసం ముందస్తు అనుమతి తప్పనిసరని అన్నారు. ఈ ఉత్తర్వులు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు కొనసాగుతాయన్నారు.


