News February 15, 2025
జన్నారం: స్వగ్రామానికి చేరిన మల్లేశ్ మృతదేహం

ఇటీవలే ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేశ్ మృతదేహం శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కవ్వాల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతదేహంపై పడి భార్య రోదిస్తుంటే గ్రామంలోని వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.
Similar News
News March 19, 2025
రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించిన ADB బిడ్డ

ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన నాతోరి రవీందర్ ప్రభుత్వం విడుదల చేసిన HWO ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకును సాధించి అందరి మన్ననలు పొందారు. రవీందర్ ఉట్నూర్ కీబీ ప్రాంగణంలోని ప్రభుత్వ పీఈటీసీ లైబ్రరీలో చదివి ఉద్యోగం సాధించారు. రవీందర్‌ను పీఈటీసీ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, తోటి విద్యార్థులు అభినందించారు..
News March 19, 2025
ఉట్నూర్: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కును రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.
News March 19, 2025
ADB: రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో మనోళ్లకే మొదటి స్థానం

ADBలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచారు. HYDలో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ పాలన శాస్త్రంలో “ఆరు గ్యారంటీల అమలుకు అవకాశాలు: ADBపై ఒక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బేగం వారిని అభినందించారు.