News February 27, 2025
జన్నారం: 2రోజులపాటు పక్షి మహోత్సవం

కవ్వాల్ అభయారణ్యం, గోదావరి పరివాహక ప్రాంత పక్షి వైవిధ్యంపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చేందుకు మార్చి 1, 2 తేదీల్లో పక్షి మహోత్సవాన్ని నిర్వహించనున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మా రావ్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 1, 2 తేదీల్లో మంచిర్యాల కలెక్టరేట్ వద్ద పక్షి మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రకృతి, పక్షి ప్రేమికులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు.
Similar News
News November 18, 2025
సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.
News November 18, 2025
SRCL: ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.
News November 18, 2025
పుట్టపర్తికి సచిన్ టెండూల్కర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ పుట్టపర్తికి చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ను మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతసేపు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.


